ETV Bharat / city

సామాజిక మాధ్యమాల్లో అతి చేస్తే... ఇక అంతే..! - విశాఖలో సీఐడీ సమావేశం

సామాజిక మాధ్యమాల్లో అతిగా ప్రవర్తించే వారికి అడ్డుకట్ట వేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సమాజంలో అశాంతిని సృష్టించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర పదజాలంతో దాడికి దిగే వారిపై కఠినంగా వ్యవహరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ దిశగా విశాఖలో సీఐడీ... సైబర్ నేరాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించింది.

cid taking actions to decrease cyber crimes

author img

By

Published : Jan 24, 2020, 8:16 AM IST

సామాజిక మాధ్యమాల్లో అతి చేస్తే... ఇక అంతే..!

దేశంలో సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్న వారి సంఖ్య సుమారు 30 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఇన్​స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్... ఈ యాప్‌లదే. నేటి సామాజిక యుగమంతా. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రికెట్ స్టార్లు ఇలా చెప్పుకొంటూ పోతే సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవారికి ఫాలోవర్ల సంఖ్య సైతం అందుకు అనుగుణంగానే పెరుగుతోంది. అయితే అసలు చిక్కంతా ఇక్కడే వస్తోంది. సున్నితమైన అంశాలపై పోస్టులు, ట్రోల్స్‌తో సమాజంలో కొందరు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా చేయడం పోలీసులకు సవాలుగా మారింది. ఇలాంటి ఆగడాలకు ఏపీ సీఐడీ చర్యలు తీసుకోనుంది.

విశాఖలో సీఐడీ అధికారులు సైబర్ నేరాల నియంత్రణపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పోస్టులు, ట్రోల్స్‌పై కన్నేసి ఉంచేందుకు ఆయా సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అసభ్యకర, రెచ్చగొట్టే పోస్టులతో కలిగే దుష్పరిణామాలను ఇన్​స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్, గూగుల్ ప్రతినిధులకు అధికారులు వివరించారు. వాటి వల్ల జరిగే అనర్థాలు, శాంతి భద్రతల సమస్యలను వివరించి... కీలక సమయాల్లో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహించనున్నట్లు.... సీఐడీ అధికారులు వెల్లడించారు. ఈ - కామర్స్ కంపెనీలతోనూ చర్చించి సైబర్ మోసాలను అదుపు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో.. ఘరానా మోసం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.