దిల్లీ సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు నుంచి రూ.7,71,000 విలువగల విమాన టిక్కెట్ కొనుకోలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. ' మేము దిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులం మాట్లాడుతున్నాం. మహిళలను వేధిస్తున్నందుకు మీ మీద కేసు నమోదైంది. విచారణ కోసం దిల్లీకి రావాల్సి ఉంటుంది' అని వెంకటేశ్వరరావుకు చెప్పారు. వారి మాటలకు వణికిపోయిన బాధితుడు తాను ఏ తప్పు చేయలేదని చెప్పాడు. అయినప్పటికీ అతనిని బెదిరించి ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయించారు నకిలీ పోలీసులు. ఆ యాప్ ద్వారా బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.7,71,000 విలువైన విమాన టిక్కెట్ కొనుకోలు చేశారు. మోసపోయానని తెలుసుకున్న వెంకటేశ్వరరావు.. పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించారు. వారి బ్యాంక్ ఖాతాల నుంచి నగదు రికవరీ చేశారు. నగదు తిరిగి రాబట్టిన పోలీస్ కమిషనర్‌కు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇదీ చదవండి: