విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ గోపీనాధ్, ఎస్సై రవికుమార్‌లను నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా వీరిద్దరిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ ప్రకటన విడుదల చేశారు. అలాగే నగర పోలీసు శాఖకు చెందిన సిబ్బంది ఎవరైనా ఎటువంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడినా... క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించినా సహించబోమని స్పష్టం చేశారు. తక్షణమే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ మీనా హెచ్చరించారు.
ఇదీ చదవండి