కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు... అపరిశుభ్రతతో పారిశుద్ధ్య కార్మికులు రోజూ యుద్ధం చేస్తున్నారు. మరోవైపు ఆర్థిక పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో పెద్ద వాల్తేరులోని ఛాతి ఆసుపత్రిలో కరోనా రోగి వద్దకు నేరుగా వెళ్లి పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందిస్తున్నారు.
అయితే తమకు మూడు నెలల నుంచి వేతనాలు అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డులో పని చేసి ఇంటికి వెళ్తే కాలనీ వాళ్లు నిరాకరిస్తున్నారని... అద్దె కోసం ఇంటి యజమానులు ఒత్తిడి చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఇంత కష్టపడుతున్న తమకు అందాల్సిన వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం, అధికారులు ఆలస్యం వహించడం బాధ కలిగిస్తోందంటూ కన్నీటిపర్యంతమయ్యారు.