Chandrababu Fire On Jagan పలాసలో బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం నేతలు వెళ్తుంటే సీఎం ఎందుకు భయపడుతున్నాడని చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో తెలుగుదేశం నేతలను ఎందుకు అరెస్టు చేశారు, ఆంక్షలు ఎందుకు పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అర్ధరాత్రి కూల్చివేతలు, అక్రమ కేసులపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. తెలుగుదేశం నేతలు పరామర్శకు వెళ్లకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని నిలదీశారు. పలాసలో రాజకీయ కక్షతో తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం ఈ స్థాయిలో వణికిపోతుందని అన్నారు. పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఏం జరిగిందంటే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను శ్రీకాకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస వెళ్తున్న ఆయన్ను ఆమదాలవలస మండలం కొత్త రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ జాతీయరహదారిపై తెదేపా శ్రేణుల ఆందోళనకు దిగాయి. పోలీసులు, తెదేపా శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి లోకేశ్ నిరసన తెలిపారు. పోలీసులకు లోకేశ్ కు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. లోకేశ్‌తో పాటు కళా వెంకట్రావు, చినరాజప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎచ్చెర్ల మండలం జేఆర్ పురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి