GVL on CM Jagan: రాష్ట్రంలో వైకాపా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఓ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వారిని విస్మరించారని ఆక్షేపించారు. అగ్రకుల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీని గానీ, బీసీని గాని ముఖ్యమంత్రిని చేసే దమ్ము.. జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : పేదల జీవితాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం: శైలజానాథ్