విశాఖలో రాజకీయాలు ఇంత దారుణంగా దిగజారటం ఎప్పుడూ చూడలేదని భాజపా నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైకాపా ప్రలోభాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ వాహనాల్లో మద్యం సరఫరా చేస్తున్నారన్నారు. 14వ వార్డులో భాజపా అభ్యర్థి పరుశురామ్ ఎన్నికల ప్రచారానికి వైకాపా నేతలు అడ్డుపడుతున్నారని..ఈ విషయమై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో వార్డు వాలంటీర్లను ఉపయోగించుకుంటూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. రాజకీయాల్లో ఇలాంటి చవకబారు పనులు సరికాదని హితవు పలికారు.
భాజపా అభ్యర్థి గుర్తు మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయటం దారుణమని విశాఖ మాజీ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు విమర్శించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఇదీచదవండి