ప్రైవేట్ పోర్టులన్నీ.. మధ్యవర్తులుగా, బ్రోకరేజ్ చేసి అదానీకి, అరబిందోకి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి కట్టబెడుతున్నారని తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణ విశాఖలో ఆరోపించారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ మధ్యవర్తులుగా జగన్, విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు విశాఖ గంగవరం పోర్టులోని 86 శాతం వాటాను అదానీకి కట్టబెట్టారని.. ప్రభుత్వం వాటా 10 శాతంగానే ఉంచారని మండిపడ్డారు.
లాభాలతో నడుస్తున్న సంస్థలను లాక్కొని మరొక సంస్థకి ఇవ్వటం సరికాదని.. దమ్ముంటే వారిచేత కొత్తవి పెట్టించాలని సవాల్ విసిరారు. విశాఖ నగరవాసులకు నీటిని అందించేందుకు జీవీఎంసీ... 2,300 కోట్లతో పైప్ లైన్ ద్వారా నీటిని రప్పించేందుకు పథకం రూపొందించిందని.. ఈ ప్రతిపాదన కూడా ఏదో సంస్థకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరో ఏడాదిన్నరలో పోలవరం పూర్తయితే దీని అవసరం ఉండదని... కావాలంటే జీవీఎంసీకి స్టోరేజ్ ట్యాంకులు నిర్మించడం మీద దృష్టి పెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి:
లోపాయికారీ ఒప్పందంతోనే జేపీ వెంచర్స్‌కు ఇసుక టెండర్లు: తెదేపా