Baby dead body: విశాఖ కేజీహెచ్ ప్రసూతి విభాగంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి లేబర్ రూమ్‌కు దగ్గరలోని మరుగుదొడ్డిలో ఆడ శిశువు మృతదేహం కలకలం రేగింది. ఆసుపత్రి వైద్యాధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లేబర్ రూమ్‌లో ప్రసవాలకు సిద్ధమయ్యే గర్భిణులను మూడు కేటగిరీలుగా ఉంచుతారు. తొలి కేటగిరీలోని గర్భిణులు ఉండే గదికి ఆనుకొని ఉన్న మరుగుదొడ్డి నుంచి గురువారం ఉదయం దుర్వాసన రావడంతో సిబ్బంది పరిశీలించారు. వస్త్రాలతో కప్పేసి ఉన్న శిశువును గుర్తించారు. అప్పటికే శిశువుకు ప్రాణం లేదు. ప్రసూతి విభాగ వైద్యాధికారులు ఈ విషయాన్ని పర్యవేక్షక వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు.
వైద్యాధికారులు వెళ్లి ఘటనపై ఆరా తీశారు. ఆసుపత్రిలో గత నాలుగు రోజుల్లో పుట్టిన శిశువుల్లో మృతి చెందిన వారి వివరాలపై ఆరా తీశారు. నాలుగు రోజుల వ్యవధిలో ఆరుగురు పిల్లలు మృతి చెందినట్లు గుర్తించి, వారి తల్లులతో మాట్లాడారు. మృత శిశువులను శ్మశాన వాటికకు తీసుకెళ్లిన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వారు రశీదులు చూపించారు. దీంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెలివరీ గదికి దగ్గరలో ఉండే పడకలు కావడంతో అక్కడ సీసీ కెమెరాలు లేవని తెలిపారు. ప్రసూతి విభాగంలో డెలివరీ అయిన మహిళలు, వారి పిల్లల సంఖ్యను పరిశీలించగా లెక్క సరిపోయింది. దీంతో మృత శిశువు ఎవరన్నది. అంతుపట్టడం లేదు. గతంలో ఎన్నడూ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జరగలేదని సిబ్బంది తెలిపారు. మృత శిశువును శవపరీక్ష కోసం మార్చురీకి తరలించారు.
ఇవీ చదవండి: