ETV Bharat / city

Baby Without Ears: చెవులు లేకుండా శిశువు జననం... ఎక్కడంటే?

Baby With No Ears: మనం సహజంగా కాళ్లు లేకుండా లేదా చేతులు లేకుండా అప్పుడే పుట్టిన పిల్లలను చాలా మందినే చూసుంటాం. కానీ ఇక్కడ అరుదుగా చెవులు లేకుండా శిశువు జన్మించింది. ఇది విశాఖ జిల్లా పాడేరులో జరిగింది.

baby with no ears
చెవులు లేకుండా శిశువు జననం
author img

By

Published : Mar 20, 2022, 7:35 AM IST

Updated : Mar 20, 2022, 1:08 PM IST

Baby With No Ears: విశాఖ జిల్లా పెదబయలు మండలం వనబంగి గ్రామానికి చెందిన మోహన్‌రావు, నాగమణి భార్యాభర్తలకు రెండు చెవులూ లేకుండా మగబిడ్డ జన్మించాడు. ఈ నెల 18వ తేదీన నాగమణి పాడేరు జిల్లా ఆసుపత్రి ప్రసూతి విభాగంలో చేరారు. అదే రోజు సాయంత్రం ఆమె బిడ్డను ప్రసవించారు.

చెవులు లేకుండా జన్మించిన శిశువును చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ బిడ్డ వీరికి రెండో సంతానం. శిశువు ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన పరీక్షలు, చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఇలాంటి జననాలు చాలా అరుదుగా జరుగుతాయని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శంకరప్రసాద్‌ అన్నారు.

చెవులు లేకుండా శిశువు జననం

కేజీహెచ్​లో నవ జాత శిశు సమగ్ర వైద్య సేవాకేంద్రంలో ఆ శిశువుకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పిల్లల విభాగం నిపుణులు, కేజీహెచ్ ఉన్నత వైద్యులు బిడ్డ ను పరిశీలిస్తున్నారు.

పుట్టినప్పుడు ఏడవలేదని మా దగ్గరికి తీసుకువచ్చారు. ఇలాంటివి ఎక్కువగా జన్యుపరమైన లోపాల కారణంగా జరుగుతాయి. తల్లి గర్భణిగా ఉన్నప్పుడు ఇతర మందులు వాడినా లేదా నాటు వైద్యం చేయించుకున్న ఇలా జరుగుతుంది. కానీ అటువంటివి ఏమి వాడలేదని తల్లి చెప్పింది. -డా. నీరజ, పిల్లల వైద్యురాలు

ఇదీ చదవండి:

MLA Dwarampudi: పవన్‌కల్యాణ్‌ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా: కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి

Last Updated : Mar 20, 2022, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.