విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు అధికార పార్టీ తరఫున కృషి చేస్తామని మంత్రి అవంతి స్పష్టం చేశారు. పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో కార్మిక వర్గాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. వైకాపా తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఉక్కు పరిరక్షణ కోసం రాజీనామాలు చేయాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయని.. ఎంపీలు రాజీనామా చేస్తే.. మన వాణిని పార్లమెంట్లో ఎలా వినిపిస్తామని ప్రశ్నించారు. ఉక్కు పరిరక్షణకు అన్ని పార్టీల అధినేతలు ప్రధానికి లేఖలు రాయాలని.. కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యం కాదని లేఖల్లో పేర్కొనాలని సూచించారు.
స్టీల్‌ప్లాంట్ జాతీయ సంపద. ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోం. అసెంబ్లీ తీర్మానంతో 5 కోట్ల మంది ఆకాంక్షను కేంద్రానికి చెబుతాం. పోస్కో ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ రాదని సీఎం స్పష్టంగా చెప్పారు. విభజన చట్టంలో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను ఇవ్వలేదు. ఉన్న స్టీల్‌ప్లాంట్‌నూ ప్రైవేటుపరం చేస్తామనడం బాధగా ఉంది.
- మంత్రి అవంతి
ఇదీ చదవండి:
ఉక్కు ఉద్యమం: 'విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వం'