గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రత్యేక అధికారిని నియమించి నివేదికతో సహా అన్నీ సమర్పించినా.... ఇప్పటికీ ప్రత్యేక జోన్ కార్యాచరణలోకి రాలేదన్నది వాస్తవం. బడ్జెట్‌లో విశాఖ జోన్ ప్రస్తావన ఉండటం సహా... వాల్తేర్ డివిజన్‌ను ఇందులోనే ఉంచాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.
ఈ బడ్జెట్‌లో విశాఖ జోన్ ప్రారంభోత్సవంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయల కల్పనపైనా దృష్టి పెట్టాలని రైల్వే ఉద్యోగుల సంఘం నేతలు కోరుతున్నారు. నగరం నుంచి వివిధ కీలక ప్రదేశాలకు రైలు మార్గాలు వేయాలంటున్నారు.
ఇదీ చదవండి: పద్దు 2020: బడ్జెట్ సూట్కేస్ చరిత్ర తెలుసా?