నిబంధనలకు విరుద్ధంగా అవయవ మార్పిడిలాంటి ఘటనలు వెలుగుచూస్తే.. కఠినంగా వ్యవహరిస్తామని విశాఖ పోలీసు కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా హెచ్చరించారు. విశాఖలో ఓ వ్యక్తి కిడ్నీని అమ్ముకుని మోసపోయినట్లు ఫిర్యాదు చేసిన ఘటన, విచారణలో తేలిన అంశాలను వివరించారు. హైదరాబాద్ కు చెందిన తంబళ్ల పార్ధసారథి అనే వ్యక్తి... ఆర్థిక ఇబ్బందులతో ఒక కిడ్నీ అమ్ముకునేందుకు బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తిని సంప్రదించినట్లు సీపీ చెప్పారు. ఆ తరువాత విశాఖలోని శ్రద్ధఆసుపత్రి డాక్టర్ దొడ్డి ప్రభాకర్ ను కలిశారని... వివిధ పరీక్షలు నిర్వహించిన తరువాత నకిలీ ఆధార్ కార్డు సృష్టించి ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. కిడ్నీ మార్పిడికి 12 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకుని, కేవలం 5 లక్షలే ఇచ్చారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్, మంజునాథ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
నకిలీ ఆధార్‌తో కిడ్నీ దానం.. ఇద్దరి అరెస్టు - ఇద్దరి అరెస్టు
కిడ్నీ మార్పిడి కోసం నకిలీ ఆధార్ సృష్టించి.. దందాకు దిగిన ఇద్దరిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి వారి చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు.