అక్టోబర్ 6న విశాఖపట్నంలో నిర్వహించనున్న ' పబ్జీ మొబైల్ ఇండియా టూర్ - 2019'ను నిలువరించాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విశాఖలో ఆ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతులు తీసుకున్నారా? లేదా? తదితర వివరాల్ని సమర్పించాలని ఏపీ హోంశాఖను ఆదేశించింది. విచారణను నేటికి వాయిదా వేసింది. పబ్జీ క్రీడను నిషేధించాలని, ఆ క్రీడను పర్యవేక్షించే నిమిత్తం కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థిస్తూ కృష్ణాజిల్లాకు చెందిన ఓ గ్రామ వాలంటీర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ క్రీడను ఆడొద్దని చెప్పినందుకు విశాఖలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఆన్ లైన్లో ఈ క్రీడను ఆడుతున్న విషయాన్ని తెలిపారు. శారీరకంగా హాని ఉండదని కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పబ్జీ, బ్లూవేల్ క్రీడపై న్యాయస్థానాల్లో ఇప్పటికే ఏమైనా కేసులు దాఖలు అయ్యాయా? వాటి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. పబ్జీ ప్రభావాలు ఏమిటో తెలసుకోవడానికి ఈ రోజే ఆ గేమ్ ను ఆడతామని చమత్కరించింది. విశాఖలో టూర్ నిర్వహణకు అనుమతులు తీసుకున్నారా ? లేదా ? వివరాలు సమర్పించాలని విచారణను నేటికి వాయిదా వేసింది.
ఈ రోజే పబ్జీ గేమ్ ఆడతాం: హై కోర్టు
హింసను ప్రోత్సహించే విధంగా ఉన్న పబ్జీ మొబైల్ క్రీడను నిషేధించాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. విశాఖలో నిర్వహించనున్న 'పబ్జీ మెుబైల్ ఇండియా టూర్-2019' కార్యక్రమానికి అనుమతి తీసుకున్నారా? అని ఏపీ హోంశాఖను ధర్మాసనం ప్రశ్నించింది.
అక్టోబర్ 6న విశాఖపట్నంలో నిర్వహించనున్న ' పబ్జీ మొబైల్ ఇండియా టూర్ - 2019'ను నిలువరించాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విశాఖలో ఆ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతులు తీసుకున్నారా? లేదా? తదితర వివరాల్ని సమర్పించాలని ఏపీ హోంశాఖను ఆదేశించింది. విచారణను నేటికి వాయిదా వేసింది. పబ్జీ క్రీడను నిషేధించాలని, ఆ క్రీడను పర్యవేక్షించే నిమిత్తం కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థిస్తూ కృష్ణాజిల్లాకు చెందిన ఓ గ్రామ వాలంటీర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ క్రీడను ఆడొద్దని చెప్పినందుకు విశాఖలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఆన్ లైన్లో ఈ క్రీడను ఆడుతున్న విషయాన్ని తెలిపారు. శారీరకంగా హాని ఉండదని కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పబ్జీ, బ్లూవేల్ క్రీడపై న్యాయస్థానాల్లో ఇప్పటికే ఏమైనా కేసులు దాఖలు అయ్యాయా? వాటి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. పబ్జీ ప్రభావాలు ఏమిటో తెలసుకోవడానికి ఈ రోజే ఆ గేమ్ ను ఆడతామని చమత్కరించింది. విశాఖలో టూర్ నిర్వహణకు అనుమతులు తీసుకున్నారా ? లేదా ? వివరాలు సమర్పించాలని విచారణను నేటికి వాయిదా వేసింది.
TAGGED:
ap high court on pubji game