High Court On Visakha Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణకు కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలపై ఫిబ్రవరి 2న తుది విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టంచేసింది. ఈలోపు ప్రైవేటీకరణకు కీలక అడుగులు పడితే ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చి ముందుస్తు విచారణను కోరే స్వేచ్ఛను పిటిషనర్లకు ఇచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా, జస్టిస్. ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జాయిన్ ఫర్ డెవలప్ మెంట్ పౌండేషన్ చైర్మన్, విశ్రాంత ఐపీఎస్ అధికారి వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ (సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ) హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సొసైటీ ఫర్ ప్రొటక్షన్ అప్ స్కాలర్షిప్ హోల్డర్స్ అధ్యక్షుడు డి.సువర్ధరాజు మరో వ్య్యాం వేశారు. గురువారం జరిగిన చారణలో కేంద్ర ప్రభుత్వం చదవున సహాయ పాలిసిటర్ జనరల్ హరినాథ్ స్పందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేశాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంకా కౌంటర్ వేయాల్సి ఉందన్నారు.
హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చు: లక్ష్మీనారాయణ
విచారణ సందర్భంగా హైకోర్టుకు వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మీడియా తో మాట్లాడారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలతో పౌరుల హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చన్నారు. అప్పట్లో భూములిచ్చిన 8వేల మంది రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో భూములిచ్చిన వారి హక్కులకు భంగం కలుగుతుందని, పలువురు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రైవేటీకరణ అవసరం ఉండదని తెలిపారు.
ఇదీ చదవండి:
SOMU VEERRAJU LETTER TO CM: 'మంచి గుడ్లు ఇవ్వలేని ప్రభుత్వం.. గుడ్ గవర్నెన్స్ ఇస్తుందా?'