ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ కోరారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. 2011 జూలై నుంచి పీఆర్సీ బకాయి ఉందని.. వెంటనే పీఆర్సీని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రధానంగా సీపీఎస్ రద్దు సహా 39 సమస్యలపై ప్రాధాన్యత క్రమంలో దృష్టిలో పెట్టాలని సీఎం జగన్‌ను కోరారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. మార్చి మూడో తేదీన ఉద్యోగ సంఘాల వ్యవస్థాపకుడు అవని గంటి శ్రీరాములు శత దినోత్సవం సందర్భంగా ఐక్య కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.