వైద్యుల బదిలీ విషయంలో వైద్య సంఘాలతో చర్చలు జరపాలని ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కోరింది. ప్రస్తుతం చేపట్టిన బదిలీ ప్రక్రియను నిలుపు చేయాలని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో వైద్యుల సమస్యలను పరిష్కరించాలని సంఘ సభ్యులు కోరారు. త్వరలో 16 వైద్య కళాశాల వస్తున్నాయని.. ఈ సమయంలో బదిలీలతో నష్టం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని సంఘ ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ చెప్పారు. సమ్మె చేస్తే రోగులకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. కొందరు అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలను సీఎం జగన్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి
CBN: ప్రత్యేక హోదాపై యుద్ధం చేయకుండా.. పలాయనవాదమెందుకు? : చంద్రబాబు