ETV Bharat / city

'విమ్స్, కేజీహెచ్ లలో వెయ్యి పడకల ఏర్పాటుకు చర్యలు'

విశాఖ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కింగ్ జార్జ్ ఆసుపత్రుల్లో కరోనా రోగుల కోసం మరిన్ని పడకలు సిద్ధం చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు ముమ్మరం చేసింది. కరోనా బాధితుల మరణాలను తగ్గించేందుకు ఆక్సిజన్ తో కూడిన బెడ్ ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. కనీసం ఈ రెండు ఆసుపత్రుల్లో వెయ్యి పడకలు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.

'విమ్స్, కేజీహెచ్ లలో మరో వెయ్యి బెడ్ లు'

author img

By

Published : Jul 15, 2020, 10:58 PM IST

విశాఖలో కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టంది. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్... జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి. సుధాకర్ లతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

విమ్స్ ఆసుపత్రిలో బెడ్ల సంఖ్యను 548 నుంచి 750కి పెంచడానికి చర్యలను తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని బెడ్ లకు ఆక్సిజన్ సౌకర్యం ఉండే విధంగా చేయాలన్నారు. విశాఖలో ఉన్న బోధన ఆసుపత్రులను కొవిడ్ పరీక్షలు చేసేందుకు అనువుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు.

కేజీహెచ్ లోని సి.ఎస్.ఆర్ బ్లాక్లులో 300 బెడ్ లు ఏర్పాటు చేయనున్నారు. ఛాతి ఆస్పత్రి, ఈ.ఎన్.టి ఆసుపత్రి, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, రాణి చంద్రమణి దేవి ఆసుపత్రుల్లో కొవిడ్ పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో పరీక్ష ఫలితాల కోసం నిరీక్షించే సమయంలో రోగులను ఐసోలేషన్ లో ఉంచడానికి 250 బెడ్ లు ఏర్పాటు చేయనున్నారు. రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:

ఫొటోలు అశ్లీలంగా మార్ఫింగ్​...యువతులకు బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.