144 Section at AU: విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వద్ద 2 బృందాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర వర్సిటీ, పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఏయూ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా.. ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం 'చలో ఏయూ'కు పిలుపునిచ్చింది.
మరోవైపు.. చలో ఏయూ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఏయూ పరిరక్షణ పోరాట సమితి మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఫలితంగా రెండు వర్గాలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించిన పోలీసులు.. ఏయూ, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
నాయకుల గృహనిర్భందం..
చలో ఏయూ పిలుపుతో తెదేపా, జనసేన, సీపీఎం నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ హర్షకుమార్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, పీలా రామకృష్ణ, కోన తాతారావు, దల్లి గోవిందరెడ్డి, పుచ్చా విజయకుమార్, మొల్లి పెంటిరాజు ,సుబ్బారావు, మాటూరి చిన్నారావు హౌస్ అరెస్ట్ చేసినవారిలో ఉన్నారు.
ఇదీ చదవండి:
High Court News: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు