పూర్వ విద్యార్థుల సంఘం సమ్మేళనాన్ని(అల్యూమిని మీట్) ఘనంగా నిర్వహించాలని విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం భావిస్తోంది. ఈ నెల 10న బీచ్ రోడ్డులోని ఆంధ్ర విశ్వ విద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకను నిర్వహిస్తారు. కొవిడ్ నియమాల ప్రకారం ఈ వేడుకను దృశ్య శ్రవణ మాధ్యమ(వీడియో కాన్ఫరెన్స్) రూపంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమ్మేళనంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ పాల్గొంటారని ఆంధ్ర విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. విశిష్ట అతిధులుగా రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొననున్నారు.
ఆంధ్ర విశ్వ విద్యాలయం వ్యవస్థాపక ఉపకులపతి ఆచార్య కట్టమంచి రామలింగారెడ్డి పుట్టిన రోజున ప్రతి ఏటా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఈసారి కరోనా ప్రభావంతో కేవలం దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీఎం జగన్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి