ETV Bharat / city

విశాఖలో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానం - akkineni awards in vizag

విశాఖలో డాక్టర్ అక్కినేని ఆరో అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సినీ, వైద్య, వ్యాపార, సేవా రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఆవార్డులు అందజేశారు. తెలుగు భాష కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఈ కార్యక్రమంలో వక్తలు అభిప్రాయపడ్డారు. అక్కినేని అభినయాన్ని పోలిన నృత్యాలు అలరించాయి.

విశాఖలో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానాలు

author img

By

Published : Dec 22, 2019, 8:31 AM IST

విశాఖలో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో విశాఖ విఎంఆర్డీఏ చిల్డ్రన్స్‌ ఏరినాలో ఆరో అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మాజీ గవర్నర్ సీ.హెచ్​. విద్యాసాగరరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై... జ్యోతి ప్రజ్వలన చేశారు. సినీ నటుడు మురళీ మోహన్​కు అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. శోభ నాయుడుకు రంగస్థల రత్న పురస్కారం, ముళ్ళపూడి వెంకటరత్నానికి వైద్య రత్న , కొనకలూరి ఈనాక్‌కు సాహిత్య రంగం అవార్డులు ప్రదానం చేశారు. సినీ రంగంలో 'మహానటి' చిత్రానికి, సేవా రంగంలో 'స్వచ్ఛ చల్లపల్లి' గ్రామానికి చెందిన మనం ట్రస్ట్‌కు, వ్యాపార రంగంలో సురపునేని విజయకుమార్‌కు, కార్టూనిస్ట్ శంకర నారాయణ, ఇంద్రజాల కళాకారుడు క్రాంతికుమార్‌లకు పురస్కారాలను నిర్వాహకులు అందజేశారు. అక్కినేని అవార్డులు తమకు దక్కడంపై గ్రహీతలు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగువారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో అక్కినేని ఒకరంటూ మాజీ గవర్నర్ అభిప్రాయపడ్డారు. తెలుగు గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. తెలుగు భాష కోసం ఆలోచించకపోతే అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనెస్కో సైతం మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్తోందన్నారు. మాతృ భాషలోనే విద్య బోధన ఉండాలని శాస్త్ర వేత్తలు చెప్తున్నారని గట్టిగా చెప్పారు. ఈ వేడుకలో అక్కినేని పట్ల అభిమానం ఉన్న ఒక వైద్యుడు అక్కినేని గీతాలకు నృత్యంతో అలరించారు. అలనాటి అక్కినేని నృత్యాలను అభినయించి అందరిని మంత్రం ముగ్ధులను చేశారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.