విశాఖ నగరం పాతగాజువాక సమీపంలో దారుణం చోటుచేసుకుంది. మానసిక రోగి అయిన 21 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈమేరకు బాధిత యువతి తల్లి ఫిర్యాదుతో గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. ఘాతుకానికి పాల్పడిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని సీఐ మల్లేశ్వర రావు తెలిపారు. కేసులో దర్యాప్తు జరుగుతుందని.. బాధితురాలిని కేజీహెచ్ తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: