రాజకీయ లబ్ధి కోసం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు దళితులపై దాడి చేయించి, దాన్ని వైకాపాపైకి మళ్లిస్తున్నారని జూపూడి ప్రభాకర్ రావు ఆక్షేపించారు. చిత్తూరు జిల్లాలో జడ్జి సోదరుడిపై తెదేపా వారు దాడి చేసినట్లు తెలిసినా.. దాన్ని వైకాపా చేసినట్లు ఆరోపణలు చేశారన్నారు.
దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీని ప్రదర్శించారు. డీజీపీని చంద్రబాబు ప్రతిసారీ అవమానిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు చేతనైతే నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాయాలని.. డీజీపీకి ఎందుకు లేఖ రాస్తున్నారని ప్రశ్నించారు. ఏదో ఆశించి జగన్ ప్రభుత్వంపై దళిత సోదరులు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. దళితులపై దాడులు జరిగితే తాము కచ్చితంగా ఖండిస్తామన్నారు. దళితులను అవమానపరిచేలా వ్యవహరించొద్దని తెదేపాను కోరుతున్నట్లు తెలిపారు.