ETV Bharat / city

వైఎస్​ఆర్ నేతన్న నేస్తం నిధులు విడుదల - వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు విడుదల వార్తలు

అర్హత కలిగిన నేతన్నలందరికీ ఆర్థిక సాయం అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధమని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకంలో భాగంగా రెండో విడత మొత్తాన్ని చేనేత కుటుంబాల ఖాతాలకు మంత్రి జమ చేశారు.

వైఎస్​ఆర్ నేతన్న నేస్తం నిధులు విడుదల
వైఎస్​ఆర్ నేతన్న నేస్తం నిధులు విడుదల
author img

By

Published : Nov 11, 2020, 11:17 PM IST

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం రెండో విడతగా 21.37 కోట్ల రూపాయలను 8,903 మంది చేనేతల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి గౌతమ్ ​రెడ్డి వెల్లడించారు. దారిద్య్ర రేఖకు దిగువన చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయంలో భాగంగా ఏటా నేతన్న నేస్తం పథకం ద్వారా 24 వేల రూపాయలను అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. చేనేత లాంటి విలువైన కళకు ప్రోత్సాహం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. గతేడాది డిసెంబర్ 21వ తేదీన అనంతపురంలోని ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం తొలి విడతలో భాగంగా 81,783 చేనేత కుటుంబాలకు 196.28 కోట్లు పంపిణీ చేసినట్టు మంత్రి ప్రస్తావించారు.

కరోనా కష్టకాలంలో ఆరు నెలలు ముందుగానే ఈ ఏడాది జూన్ 20వ తేదీన 81,024 మంది అర్హులైన నేతన్నలకు ముఖ్యమంత్రి రెండో విడతగా 194.46 కోట్లు అందించినట్టు తెలిపారు. వేర్వేరు కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయిన నేతన్నలకు ప్రస్తుతం ఈ ఆర్థిక సాయం అందించినట్టు మంత్రి వివరించారు. చేనేతల కళలకు తగ్గ విలువ, బ్రాండ్ తీసుకువచ్చేలా ఈ-మార్కెటింగ్​ను తర్వలో తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లతో ఒప్పందం చేసుకొని ఆన్​లైన్​లో ఆప్కో వస్త్రాలు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రమంతా ఆరోగ్యశ్రీ...ఉత్తర్వులు జారీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.