high court: వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 2 వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని...సీబీఐ ని హైకోర్టు ఆదేశించింది. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ కడప చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ క్షమాబిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేస్తూ...మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, మరో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
వారి తరఫున సీనియర్ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, టీ.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. దస్తగిరి నిందితుడిగా చెప్పిన విషయాన్ని CRPC సెక్షన్ 164 కింద వాంగ్మూలంగా నమోదు చేసి సంబంధిత కోర్టులో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసిందన్నారు. ఓసారి 164 వాంగ్మూలం నమోదు చేశాక.. అప్రూవర్‌గా మారారని మరోసారి వాంగ్మూలం నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు.
దిగువ కోర్టు దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేయబోతుందని నిలువరించాలని కోరారు. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు కోరగా న్యాయమూర్తి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న దస్తగిరికి నోటీసులు జారీచేశారు.
అటు....వివేకా హత్యకేసులో ముగ్గురు నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, ఉమా శంకర్‌రెడ్డిల రిమాండు గడువును పులివెందుల కోర్టు ఈనెల 28వ తేదీకి పొడిగించింది. నిందితుల బెయిలు పిటిషన్‌పై వాదనలు ముగియగా నిర్ణయాన్ని ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి.... హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ ఈనెల 24వ తేదీకి వాయిదా పడింది.
ఇదీ చదవండి: