బంగారం లాంటి విశాఖ ఉక్కును అమ్మే యత్నాలను ఉపసంహరించుకోవాలని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన... పెట్టుబడులు ఉపసంహరణ కాకుండా పన్నుల పెంపు లాంటి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని సూచించారు. కార్మికులు, ఉద్యోగుల ఆందోళనలను పట్టించుకోని రీతిలో కేంద్రం వ్యవహరించడం సరికాదన్నారు. ప్రైవేటీకరణ అంశాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: