సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల్లో(navarathnalu) ఒకటి రాలిపోయిందని ఎంపీ రఘురామకృష్ణరాజు(MP raghuramakrishnaraju) ఎద్దేవా చేశారు. అమ్మఒడి పథకానికి(amma vodi scheme) జనవరిలో ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా రాలేదన్న రఘురామ..నిధుల విడుదల జూన్‌కు మార్చడంతో ఒక ఏడాది ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యుత్ సమస్యపై(electricity problem) కోల్ ఇండియా ఛైర్మన్‌తో చర్చించినట్లు ఎంపీ రఘురామ వెల్లడించారు.
బొగ్గు నిల్వల కోసం తీసుకున్న చర్యలేవి...
కోల్ ఇండియాకు ఏపీ రూ.300 కోట్లు బాకీ ఉన్నట్లు కోల్ ఇండియా ఛైర్మన్(coal india chairman) చెప్పారని రఘురామ అన్నారు. రాష్ట్రాలు బొగ్గు నిల్వల పెంపునకు యత్నించాలని సూచించినట్లు వెల్లడించారు. 25 ఏళ్ల ఒప్పందాలను రద్దు చేసి, 30 ఏళ్ల ఒప్పందాలు చేసుకున్నారని ఎంపీ రఘురామ అన్నారు. ముందు జాగ్రత్తలు, బొగ్గు నిల్వల కోసం ఏయే చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. జగనన్నవి కొవ్వొత్తి, అగ్గిపెట్టె పథకాలని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోందని ఎద్దేవా చేశారు.
లెక్కలు తేలట్లేదు...
రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా సజ్జల రామకృష్ణారెడ్డే(sajjala ramakrishnareddy) మాట్లాడుతున్నారని, ఆయన ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారని రఘురామ అన్నారు. సీఎం, సీఎస్‌కు సంబంధించిన అంశాలనూ సజ్జలే చూస్తారా? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం(jagan rulling) వచ్చాక రూ.2.87 లక్షల కోట్ల అప్పులు చేశారని రఘురామ వెల్లడించారు. రాష్ట్ర ఖజానాలోని రూ.1.31 లక్షల కోట్ల లెక్కలు తేలట్లేదని మండిపడ్డారు. రెండేళ్ల ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, అప్పుల వివరాలు విడుదల చేయాలని ఎంపీ రఘురామ డిమాండ్(demand) చేశారు. ఈ అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్ర విద్యుత్ సమస్యపై కోల్ ఇండియా ఛైర్మన్‌తో చర్చించా. రాష్ట్రాలు బొగ్గు నిల్వల పెంపునకు యత్నించాలని, కోల్ ఇండియాకు ఏపీ రూ.300 కోట్లు బాకీ ఉన్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ చెప్పారు. జగనన్నవి కొవ్వొత్తి, అగ్గిపెట్టె పథకాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఏ సమస్య అయినా సజ్జలే మాట్లాడుతున్నారు. సజ్జల ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు. సీఎం, సీఎస్‌కు సంబంధించిన అంశాలను సజ్జలే చూస్తారా?. రెండేళ్ల ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, అప్పుల వివరాలు విడుదల చేయాలి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది - రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
ఇవీచదవండి.