రాష్ట్ర ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. పవన్ మాటలు చూస్తుంటే.. ఆయనకు పిచ్చి పరాకాష్ఠకు చేరినట్లుగా ఉందన్నారు. స్టార్ డమ్ అడ్డం పెట్టుకుని ఏది మాట్లాడినా చెల్లుతుందని భావిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలపై పవన్‌కు అవగాహన లేదన్నా పార్థసారథి.. వర్గాల మధ్య పోరు సృష్టించి, వివాదాల ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు.
సినిమా రంగం వల్ల పవన్ బాగుపడ్డారు తప్ప.. పవన్ వల్ల సినిమా రంగం బాగుపడలేదని పార్థసారథి విమర్శించారు. పవన్‌ను నమ్మకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే అవుతుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల వల్ల 6.81 కోట్ల మందికి రూ.లక్ష కోట్లపైనే లబ్ధి చేకూరిందనే విషయాన్ని పవన్ తెలుసుకోవాలన్నారు. ఐదేళ్ల తెదేపా పాలనలో రాష్ట్రంలో రోడ్లు మరమ్మతులు చేయలేదని.. వైకాపా అధికారంలోకి వచ్చాక వర్షాలు కురవడం వల్ల రోడ్ల పరిస్థితి బాగా లేదన్నారు. మరమ్మతుల కోసం రూ.2 వేల కోట్లతో టెండర్లు పిలిచిన సంగతి పవన్ కల్యాణ్‌కు తెలియదా అని ప్రశ్నించారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చి 12 ఏళ్లయినా.. ఒక్క ఎంపీటీసీని గెలిపించుకోలేదని, అన్నిట్లో ఘోరంగా విఫలమైన కారణంగా ప్రస్టేషన్లో ఉన్నారని ఆరోపించారు. వంద టికెట్లపై ప్రభుత్వం కేవలం 2 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుందన్నారు.
ఇదీ చదవండి