విశాఖలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడి తీరుతుందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు రక్షించే చర్యలను సీఎం జగన్ చేస్తుంటే..కక్ష సాధింపు ఎలా అవుతుందన్నారు. చంద్రబాబు హయాంలో విశాఖ భూ కుంభకోణాలపై కథనాలు వచ్చాయని..,తెదేపా నేతలే భూములు ఆక్రమించారన్నారు. వీటన్నింటిపైనా విచారణ చేసి ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుటుందన్నారు.
విశాఖలో మొత్తం 5 వేల 88 కోట్ల విలువైన 430 ఎకరాల భూములను ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకుందన్నారు. తెదేపా హయాంలో కోట్ల విలువైన భూఆక్రమణలు జరిగాయని, వీటన్నింటిపైనా చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. అక్రమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంటే తెదేపా నేతలు దుష్ప్రచారం చేయటం తగదన్నారు. భూ అక్రమాలను ప్రభుత్వం సహించదన్న అంబటి.. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు సీఎం జగన్ ఎంత దూరమైనా వెళ్తారన్నారు. గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్ సహా బాధ్యులు ఎవరైనా...వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీచదవండి