విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ప్రజల సమస్యలపై.. వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్.. రచ్చబండ ప్రజా వేదిక పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం.. నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇళ్లపట్టాలు, పింఛన్లు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇంకా అందకుండా ఉన్న అర్హులను గుర్తించి.. వారి వివరాలతో జాబితాలు రూపొందిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా.. ప్రతి లబ్ధిదారునికి పథకాలు అందేలా చూస్తామన్నారు. సాంకేతిక సమస్యలతో పథకాలు రాకుండా నిలిచిపోయిన వారి ఇబ్బందులు తీర్చేందుకు.. ఈ కార్యక్రమాన్ని డివిజన్ల వారీగా నిర్వహిస్తున్నట్లు అవినాష్ తెలిపారు.
నగరాభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కావలసిన పనులు చేసేందుకు సహకరిస్తానని.. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు.
ఇదీ చదవండి:
Eluru Elections results : వైకాపా ఖాతాలో ఏలూరు కార్పొరేషన్.. మూడుచోట్ల తెదేపా విజయం