Letter to Vijayasaireddy: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అప్పగించొద్దంటూ.. జగనన్న అభిమానులు, వైకాపా కార్యకర్తల పేరిట.. ఎంపీ విజయసాయిరెడ్డికి కొందరు రాసిన లేఖ వైరల్‌గా మారింది. తొమ్మిదేళ్ల పాటు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని కాపాడామని వారు లేఖలో పేర్కొన్నారు.
కేసుల నుంచి తప్పించుకోవడానికే.. తెదేపా నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ.. వైకాపాకు మద్దతు ప్రకటించారని ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ జెండా మోసిన వైకాపా కార్యకర్తలు.. ఇప్పటికీ అక్రమ కేసుల వ్యవహారంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా కుదేలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి నియోజకవర్గ బాధ్యతలను.. వల్లభనేని వంశీకి తప్ప ఎవరికి కేటాయించినా.. 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో పార్టీని కాపాడేందుకు సత్వరమే నూతన ఇన్‌ఛార్జ్‌ని నియమించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
Ajay Jain Fake Memo: అజయ్‌జైన్ పేరుతో మెమో.. నకిలీదిగా నిర్ధరణ