ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన బీసీ సంక్రాంతి సభ మరో జగన్నాటకమని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అమరావతి రైతులకు పోటీగానే వైకాపా సభ జరిగిందని విమర్శించారు. ఇదంతా బీసీల్లో ఐక్యతను దెబ్బతీసే పన్నాగమేనన్నారు. బీసీలకు కావాల్సింది ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కాదన్న యనమల... రాజ్యాధికారం, చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలన్నారు.
బీసీలకు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ గణన చేపట్టేలా చేయాలని యనమల డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండి: