రాజ్యాంగపరమైన విధుల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉందన్న ఆయన.. ఎన్నికల సమయంలో సామాన్యుడైనా, ప్రధాన మంత్రి అయినా చట్టం ముందు సమానులే అన్నారు. కానీ ఎన్నికల సంఘం మోడ్ ఆఫ్ కాండక్ట్ ను 'మోదీ ఆఫ్ కాండక్ట్'గా మార్చి వ్యవహరించిందని మండిపడ్డారు
అన్ని పార్టీలకు విరాళాల రూపంలో 11 కోట్లు వస్తే... ఒక్క భాజపాకు 211 కోట్లు రావటం ఏంటని ప్రశ్నించారు. రోజువారి సమస్యలపై సమీక్షించే అధికారం ముఖ్యమంత్రికి ఉందని.. దానిపై ఈసీ వివరణ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేదన్న యనమల... అప్పులపై, వడ్డీరేట్లపై సీఎస్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.
ఇదీ చదవండి