ETV Bharat / city

'ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం ఆంధ్రుల హక్కులను కాలరాయడమే'

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే దిల్లీలోనైనా ఉద్యమానికి సిద్దమని ఐక్యమహిళా వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి అన్నారు. ఈ మేరకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్​ కూడలిలో నిరసన ప్రదర్శన చేపట్టారు.

womens union dharna in Vijayawada against privatization of Visakhapatnam steel plant
'ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం ఆంధ్రుల హక్కలను కాలరాయడమే'
author img

By

Published : Feb 9, 2021, 1:59 PM IST

వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడమంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని ఐక్య మహిళా వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి అన్నారు. లేఖలతో కాలయాపన చేయకుండా కర్మాగారాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ లెనిన్​ కూడలిలో పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మ ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డిని డిమాండ్ చేశారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించేలా కృషి చేయాలన్నారని కోరారు. సంస్థను కాపాడుకునేందుకు అవసరమైతే దిల్లీలో ఉద్యమానికైనా సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు పద్మ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు కర్మాగారంపై నిర్ణయాన్ని పునరాలోచించాలి: కనకమేడల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.