ETV Bharat / city

'రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోంది' - తెదేపా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ... అమరావతి పరిరక్షణ సమితి మహిళా విభాగం నేతలు విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.

Women Jac Protest At Dharna Chowk vijayawada
విజయవాడ ధర్నా చౌక్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి మహిళా విభాగం నేతలు ధర్నా
author img

By

Published : Feb 26, 2020, 3:26 PM IST

విజయవాడ ధర్నా చౌక్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి మహిళా విభాగం నేతలు ధర్నా

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి మహిళా విభాగం నేతలు విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన దీక్షలో కూర్చున్నారు. ఎర్ర చీరలు కట్టుకుని, పచ్చ కండువాలు ధరించి 24 గంటల రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మహిళా ఐకాస నేతలతో పాటు... వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. తెదేపా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబూరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎమ్మెల్సీ రామకృష్ణ మద్దతు తెలుపుతూ దీక్షా శిబిరంలో కూర్చున్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని, నిరసనకారులను విద్రోహులుగా చిత్రీకరించి కేసుల పేరుతో వేధిస్తున్నారని వివిధ పార్టీల నేతలు మండిపడ్డారు.

ఇవీ చదవండి...పేరుకే పెద్దాసుపత్రి..సేవలు అధోగతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.