ETV Bharat / city

GIRL DEATH CASE: అగనంపూడి బాలిక మృతిపై సీపీకి రాష్ట్ర మహిళా కమిషన్‌ లేఖ - విజయవాడ వార్తలు

విశాఖలోని అగనంపూడి ప్రాంతంలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసు వివరాలు కోరుతూ రాష్ట్ర మహిళా కమిషన్‌ లేఖ రాసింది. బాలికది అసలు ఆత్మహత్యా లేక హత్యా తేల్చాలని సీపీని విజ్ఞప్తి చేసింది.

GIRL DEATH CASE
GIRL DEATH CASE
author img

By

Published : Oct 18, 2021, 8:50 PM IST

విశాఖ పారిశ్రామిక ప్రాంతమైన అగనంపూడిలో బాలిక మృతిపై రాష్ట్ర మహిళా కమిషన్‌ లేఖ రాసింది. బాలిక మృతి కారణాలపై సమగ్ర విచారణ నివేదిక ఇవ్వాలని విశాఖ సీపీని లేఖలో కోరింది. బాలికది అసలు ఆత్మహత్యా లేక హత్యా తేల్చాలని విజ్ఞప్తి చేసింది.

అసలు ఏం జరిగింది.. పోలీసులు ఏమన్నారంటే..

విశాఖ పారిశ్రామిక ప్రాంతమైన అగనంపూడి(aganampudi) వద్ద జరిగిన మైనర్ బాలిక అనుమానాస్పద మృతి(suspicious death) కేసును పోలీసులు ఛేదించారు. మృతికి కారణమైన నరేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి పోక్సో(pocso act)తో సహా పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఆ బాలికను లొంగదీసుకుని మూడు నెలలుగా అమెకు మాయమాటలు చెప్పిన అతను.. చివరకు అమ్మాయి మృతికి కారణమయ్యాడని పోలీసులు వివరించారు.

భయంతో దూకేసింది...

విజయనగరం జిల్లా కొత్తపేట సమీపంలోని గొల్లపేట(gollapeta) గ్రామానికి చెందిన నరేశ్(naresh)... ఉపాధి నిమిత్తం విశాఖలోని లంకెలపాలెంలో కార్పెంటర్​గా పని చేస్తున్నాడు. శనివాడ గ్రామంలోని ఓ అపార్ట్​మెంట్​లో నరేశ్ నివాసం ఉంటున్నాడు. నరేశ్​కు ఎదురుగా ఉన్న మరో అపార్ట్​మెంట్​లో ఉంటున్న బాలిక(girl)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నిందితుడు నరేశ్... బాలికకు అశ్లీల వీడియోలు చూపిస్తూ లోబరచుకున్నట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. నరేశ్‌ అనే యువకుడితో బాలికకు శారీరక సంబంధం ఉందని సీపీ తెలిపారు. ఘటన జరిగిన రాత్రి కూడా ఇద్దరు శారీరకంగా కలిశారని, ఈ విషయం తండ్రికి తెలిస్తే ఏం జరుగుతుందోననే భయంతో బాలిక టెర్రస్(terrace) పై నుంచి దూకి ఆత్మహత్య(suicide) చేసుకుందని సీపీ వివరించారు.

రిమాండ్​కు నిందితుడు...

బాధితురాలి తల్లి ఫిర్యాదుతో(complaint) కేసు నమోదు చేసుకుని, గంటల వ్యవధిలోనే కేసును ఛేదించినట్లు(case chased) సీపీ తెలిపారు. ఇష్టపడి కలిసినా బాలిక మైనర్ కావడంతో నిందితుడిపై అత్యాచారం కేసు(rape case) నమోదు చేశామన్నారు. నరేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌(remand)కు పంపినట్లు సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు.

నరేశ్‌ అనే యువకుడితో బాలికకు శారీరక సంబంధం ఉంది. బాలికకు మాయమాటలు చెప్పి నరేశ్‌ లోబరుచుకున్నాడు. తండ్రికి తెలిస్తే ఏం జరుగుతుందోనని బాలిక భయపడింది. ఇష్టపడి కలిసినా బాలిక మైనర్ కావడంతో అత్యాచారం కేసు నమోదు చేశాం. యువకుడు నరేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. -మనీష్ కుమార్ సిన్హా, విశాఖ సీపీ

ఇదీ చదవండి:

GIRL DEATH CASE: బాలిక మృతి కేసు... ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.