ETV Bharat / city

'మాకు కావాల్సింది ఎన్​కౌంటర్లు కాదు.. 'రక్షణ'' - Sirpurkar Commission report in disha case

Women's rights on Sirpurkar Commission: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్​కౌంటర్ కేసు​పై సిర్పూర్కర్​ కమిషన్​ ఇచ్చిన నివేదికను.. తెలంగాణ రాష్ట్ర మహిళా, ట్రాన్స్​జెండర్లు, మహిళా హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు స్వాగతించారు. నిందితుల ఎన్​కౌంటర్​ బూటకమని తేల్చిన కమిషన్​ నివేదికను సమర్థించారు. ఈ మేరకు మహిళల భద్రత, రక్షణపై రాష్ట్ర హైకోర్టుకు ఈ సంఘాలు పలు సిఫార్సులు చేశాయి.

Women's rights on Sirpurkar Commission
'మాకు కావాల్సింది ఎన్​కౌంటర్లు కాదు.. 'రక్షణ''
author img

By

Published : May 22, 2022, 11:19 AM IST

Women's rights on Sirpurkar Commission: మహిళల భద్రత కోసం చట్టబద్ధమైన ప్రక్రియే అమలయ్యేలా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, ట్రాన్స్​జెండర్ల సంఘాలు, మహిళా హక్కులు, పౌర హక్కుల సంఘాల కార్యకర్తలు డిమాండ్​ చేశారు. మహిళలకు భద్రత, స్వేచ్ఛ పేరుతో పోలీసులు బూటకపు ఎన్​కౌంటర్లకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. దిశ హత్యాచార నిందితుల ఎన్​కౌంటర్ కేసు​పై సుప్రీంకోర్టుకు ఈ నెల 20న జస్టిస్​. వి.ఎస్​. సిర్పూర్కర్​ కమిషన్​ ఇచ్చిన నివేదికను స్వాగతించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి.. సంఘాలు పలు సిఫార్సులు చేశాయి.

దిశ హత్యాచార ఘటనలో ముగ్గురు మైనర్లతో సహా నిందితుల ఎన్​కౌంటర్​పై పాల్పడిన 10 మంది పోలీసులపై క్రిమినల్​ చర్యలు తీసుకోవాలని ఈ సంఘాలు డిమాండ్​ చేశాయి. వారిపై హత్యాచారం కింద కేసు నమోదు చేయడంతో.. వారిని త్వరితగతిన విచారణ చేయాలని కోరాయి. అదే విధంగా నిందితుల ఎన్​కౌంటర్​తో మరుగున పడిన దిశ హత్యాచారం కేసుపై దర్యాప్తు చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. ఎన్​కౌంటర్​లో మరణించిన నలుగురు నిందితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం.. పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్​ చేశాయి.

మహిళల రక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించి పోలీసులు నిందితులను ఎన్​కౌంటర్​ చేయడం ద్వారా బాధితులు, వారి కుటుంబాలకు సరైన న్యాయం జరగదని మహిళా సంఘాల కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారానే మహిళల హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. నిందితుల బూటకపు ఎన్​కౌంటర్​ను సమర్థించిన సీనియర్​ పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు.. ఇలాంటి వాటికి మద్దతు పలకకుండా.. న్యాయ వ్యవస్థ ద్వారానే బాధితులకు న్యాయం జరిగేలా పోరాడాలని హితవు పలికారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.