Rape Case in Vijayawada: విజయవాడలో మతిస్థిమితం లేని యువతిపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వాంబే కాలనీ చెందిన మతిస్థిమితం లేని ఓ యువతిపై ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతికి మాయమాటలు చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు.. అక్కడ స్నేహితులతో కలిసి లైంగిక దాడి చేశాడు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు.. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితులను శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
TDP and CPI Protest: అత్యాచార బాధిత యువతి కుటుంబసభ్యులను తెలుగుదేశం, సీపీఎం నేతలు పరామర్శించారు. రాష్ట్రంలో దిశ చట్టం ఎక్కడుందని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఘటనపై సీఎం బాధ్యత వహిస్తూ.. వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. దాడిని నిరసిస్తూ.. నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ధర్నా చేశారు. అయితే ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.
Three Victims Arrested: అత్యాచార కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు విజయవాడ సీపీ క్రాంతిరాణా టాట వెల్లడించారు. ఈ కేసులో దిశ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించామన్నారు. ఘటనపై 15రోజుల్లో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని స్పష్టంచేశారు. నిందితులకు శిక్షపడేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: Sexual assault: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం... బాలికపై ఒప్పంద ఉద్యోగి ఘాతుకం