ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలకు పరుగుపాడు-నెల్లూరు మార్గంలోని రైల్వే ట్రాక్ ఘోరంగా దెబ్బతింది. దీంతో పలు రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. దెబ్బతిన్న రైల్వే ట్రాకులను పునరుద్ధించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడ-చెన్నై గ్రాండ్ ట్రంక్ మార్గంలోని(Vijayawada-Chennai Grand Trunk Way) కీలకమైన నెల్లూరు-పరుగుపాడు రైల్వే పునరుద్దరణ పనులను రికార్డుస్థాయిలో పూర్తిచేశారు.
నిర్విరామంగా పనిచేసి కేవలం 48గంటల్లోనే 1.8 కిలోమీటర్ల ట్రాక్‌ను పునరుద్ధరించారు (With in 48 hours of time Nellore-Parugupadu railway track restored ). నిపుణులైన రైల్వే సాంకేతిక సిబ్బందితోపాటు పెద్ద ఎత్తున యంత్ర పరికరాలను ఈ మార్గం వద్దకు పంపి, ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేయించారు.
వరద ప్రవాహం పెద్ద ఎత్తున ఉండటంతో ట్రాక్ పునరుద్దరణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రైల్వే ట్రాక్‌ను సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ప్రస్తుతం వరద ఉధృతి కూడా తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ రైళ్ల రాకపోకలను క్రమబద్దీకరించారు. విజయవాడ డీఆర్‌ఎం ఎస్.మోహన్, అదనపు డీఆర్‌ఎం డి.శ్రీనివాసరావు పునరుద్దరణ పనులను పర్యవేక్షించారు. ట్రాక్ పునరుద్దరణలో శ్రమించిన ప్రతి ఒక్కరికీ రైల్వే ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి : MINISTER GOWTHAM REDDY: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి నిరసన సెగ