ETV Bharat / city

ఇళ్ల స్థలాల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారు: సామినేని - ఇళ్ల స్థలాలను పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారని విప్ సామినేని ఉదయభాను ఫైర్

రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు సీఎం జగన్ చర్యలు చేపట్టారని... కానీ తెదేపా అధినేత చంద్రబాబు దానిని అడ్డుకున్నారని ప్రభుత్వ విప్, సామినేని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు.

whip udayabhanu fires on chandrababu naidu on stopping distributoion houses to beneficiaries
ఇళ్ల స్థలాలను పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారు: సామినేని ఉదయభాను
author img

By

Published : Oct 7, 2020, 6:23 PM IST

Updated : Oct 7, 2020, 6:48 PM IST

పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని... తెదేపా అధినేత చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే... చంద్రబాబు ఓర్వలేక తెదేపా నాయకులతో తప్పడు కేసులు బనాయించి సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడ్డ 16 నెలల్లోనే నవరత్నాల్లో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు.

జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 42.34 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాలు, 3 జతల స్కూల్ యూనిఫాం, ఒక జత బూట్లు, 2 జతల సాక్స్‌, బెల్ట్‌, నోట్‌బుక్‌లు, స్కూల్‌బ్యాగ్‌... ఇలా వివిధ రకాల వస్తువులని అందిస్తున్నట్లు తెలిపారు.

మొదటి తరగతి నుంచి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టారని, దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా దీవెన అందజేస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ‌ కిట్లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

దిల్లీకి సీఎం ఎందుకెళ్లారు? ఏం చర్చించారు?: రామ్మోహన్​నాయుడు

Last Updated : Oct 7, 2020, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.