AP EAPCET: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష- ఏపీ ఈఏపీసెట్(AP EAPCET)లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించారు. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఇంటర్ రెండో ఏడాది చదివిన విద్యార్థులు మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థులందరికీ ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు. ఎవరైనా మార్కులు ఎక్కువ కావాలనుకుంటే సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. చాలా మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఎవరైనా అభ్యర్థులు ఈ పరీక్షలు రాయకపోతే నష్టపోతారనే ఉద్దేశంతో..... ఇంటర్ మార్కులను వెయిటేజీని తొలగిస్తున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 160మార్కులకు ఈఏపీసెట్ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఇంటర్‌లో 30శాతం పాఠ్యప్రణాళిక తగ్గించినందున.... ప్రవేశ పరీక్షలోనూ వాటిలో నుంచి ప్రశ్నలు ఇవ్వరు.
ఇవీ చదవండి: Nagamalli Flowers: పదేళ్ల తర్వాత పూలు పూసే చెట్టు.. రామేశ్వరంలో అరుదైన 'నాగమల్లి'