ఇకపై కరోనా ఫలితాల కోసం మొబైల్‌కు వచ్చే సంక్షిప్త సమాచారం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. చిన్న క్లిక్‌తో కరోనా పరీక్ష ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో పరీక్షా ఫలితాలను అందుబాటులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. http://covid19.ap.gov.in వెబ్ సైట్లో పరీక్షా ఫలితాలు లభ్యమవుతాయి. వెబ్సైట్లో పేషంట్ హిస్టరీ ఫర్ కొవిడ్-19 అనే బాక్స్ పై క్లిక్ చేయాలి. పరీక్ష చేయించుకున్న వారి ఆధార్ నెంబర్ లేదా పరీక్షా సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ లేదా టెస్ట్ శాంపిల్ ఐడీ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదా పరీక్ష చేయించుకున్న వ్యక్తి పేరు, వయస్సు, లింగం, జిల్లా వివరాలు ఇవ్వాలి. సబ్మిట్ బటన్ నొక్కగానే ఇచ్చిన సెల్ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయగానే వెంటనే కరోనా పరీక్ష ఫలితం వచ్చేస్తుంది.
ఇదీ చదవండి ఎస్ఈసీగా నిమ్మగడ్డను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు