విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే 20 లక్షల క్యూబిక్ మీటర్ల చెత్తను బయో మైనింగ్ విధానం ద్వారా శుద్ధి చేసి వేరే చోటకు తరలించామని వెల్లడించారు. మరో 60 వేల టన్నుల చెత్తనూ త్వరలోనే తొలగిస్తామని స్పష్టం చేశారు. అజిత్‌సింగ్ నగర్ డంపింగ్ యార్డును విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. త్వరలోనే ఇక్కడ పార్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న సింగ్‌నగర్‌ను సింగపూర్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు.
సింగ్‌నగర్‌ను సింగపూర్‌గా మారుస్తాం: మంత్రి బొత్స - అజిత్‌సింగ్ నగర్ డంపింగ్ యార్డ్ వార్తలు
విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్థానిక డంపింగ్ యార్డ్‌ను పూర్తిగా తొలగించి పార్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.