ETV Bharat / city

Demolition: పేలుడు పదార్థంతో నీటి ట్యాంక్ కూల్చివేత - water tank collapsed in rajanna sircilla district

శిథిలావస్థకు చేరిన నీటి ట్యాంక్​ను అధికారులు పేలుడు పదార్థాల సాయంతో కూల్చివేశారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పంచాయతీ పరిధిలో జరిగిన ఈ సంఘటన దృశ్యాలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. కొందరు తమ చరవాణుల్లో బంధించారు.

పేలుడు పదార్థంతో నీటి ట్యాంక్ కూల్చివేత
పేలుడు పదార్థంతో నీటి ట్యాంక్ కూల్చివేత
author img

By

Published : Jun 3, 2021, 12:49 PM IST

పేలుడు పదార్థంతో నీటి ట్యాంక్ కూల్చివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న నీటి ట్యాంక్​ను పేలుడు పదార్థంతో కూల్చివేశారు. ఈ సంఘటనను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. దాదాపు 43 ఏళ్లుగా గ్రామప్రజలకు తాగు నీరు అందిస్తున్న ఈ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది.

కొత్త ట్యాంక్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ రూ.25 లక్షలు మంజూరు చేశారు. మూడేళ్లలో ట్యాంక్ నిర్మాణం పూర్తవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. శిథిలావస్థకు చేరిన ట్యాంక్​ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున అధికారులు దాన్ని కూల్చివేశారు. ఈ దృశ్యాలను స్థానికులు తమ చరవాణీల్లో బంధించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో 1.84 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తున్నాం: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.