ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) నుంచి నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి 69 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తుండగా..కాలువలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జులైలో 43, ఆగస్టులో 148, సెప్టెంబరులో 24 టీఎంసీల (TMC) చొప్పున ఈ ఏడాదిలో ఇప్పటివరకు 215.86 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
పులిచింతల ప్రాజెక్టులో (Pulichintala Project) ప్రస్తుతం 32 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గేటు ప్రమాదం వల్ల గరిష్ఠ నీటి నిల్వలో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇదీ చదవండి