ETV Bharat / city

projects water flow: ప్రాజెక్టులకు తగ్గుతున్న వరద - ప్రకాశం బ్యారెజీ తాజా వార్తలు

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులకు వరద రాక తగ్గుతోంది. ఇప్పటికే శ్రీశైలం, పులిచింతల జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.50 అడుగులు ఉంది. పులిచింతల ప్రాజెక్టులో 42.37 టీఎంసీల మేర నీరుంది.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/03-August-2021/12656125_water-flow.png

author img

By

Published : Aug 3, 2021, 10:45 AM IST

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జలాశయానికి 2 లక్షలా 35వేల 387 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. లక్షా 76 వేలా 19 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 884.50 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 212.91 టీఎంసీలకు చేరింది.

ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద
ప్రకాశం బ్యారేజీ (Prakasam barrage)కి వరద నీటి రాక తగ్గింది. బ్యారెజ్ ఇన్​ఫ్లో 2,77,842 క్యూసెక్కులు కాగా.. దిగువకు 9,689 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 65 గేట్లు 6 అడుగుల మేర, ఐదు గేట్లు 7 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

విద్యుత్ ఉత్పత్తి కోసం 8వేల క్యూసెక్కులు

పులిచింతల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం పులిచింతల ఇన్ ఫ్లో రెండు లక్షల 67 వేల క్యూసెక్కులు కాగా ఔట్​ఫ్లో 2లక్షల 45 వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జలాశయంలో ప్రస్తుతం 42.37 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు. అధికారులు 12గేట్లు ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 8 వేల క్యూసెక్కులు మళ్లిస్తున్నారు.

నిలిచిన రాకపోకలు..

అతి కష్టం మీద రోడ్డు దాటుతూ...
అతి కష్టం మీద రోడ్డు దాటుతూ...

కృష్ణానది నుంచి దిగువకు వదిలిన వరద నీటి ప్రవాహానికి అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక ప్రాంతంలో రహదారి తెగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి: 'కేంద్రం మొండి వైఖరి వీడకుంటే ఉద్యమం తప్పదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.