VRA Association: జగన్ అధికారంలోకి వచ్చాక వీఆర్‌ఏలకు కనీసం జీతం రూ.21వేలు ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని.. రాష్ట్ర రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేసింది. డీఏ ఉపసంహరణ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని.. వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు పెద్దన్న డిమాండ్ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా.. తమ సమస్యలు పరిష్కరించలేదని వాపోయారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేవరకు దశల వారీ ఉద్యమాలు చేపడతామన్నారు.
ఇదీ చదవండి:
RRR on YS Viveka Case: వివేకా హత్య కేసు విచారణకు వైకాపా పెద్దలు సహకరించాలి: రఘురామ