ETV Bharat / city

పద్మశ్రీ ప్రకటించడంపై వయోలిన్ విద్వాంసులు రామస్వామి హర్షం - వయోలిన్ విద్వంసులు రామస్వామికి పద్మశ్రీ రావడంపై స్పందన

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో జన్మించిన ప్రముఖ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామిని.. పద్మశ్రీ పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాలుగా వివిధ దేశాల్లో కచేరీలు చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందన్నారు.

padmashri to viiolin vidwan ramaswamy
పద్మశ్రీ వరించడంపై వయోలిన్ విద్వాంసులు రామస్వామి హర్షం
author img

By

Published : Jan 26, 2021, 4:29 PM IST

Updated : Jan 26, 2021, 6:10 PM IST

పద్మశ్రీ వరించడంపై వయోలిన్ విద్వాంసులు రామస్వామి హర్షం

అవార్డుల కోసం తానెప్పుడూ ప్రయత్నించలేదని చెబుతున్నారు కర్ణాటక సంగీత విద్వాంసులు అన్నవరపు రామస్వామి. ఏ కోరిక లేకపోవడం వల్లే ఆనందం, విచారం రెండూ తన జీవితంలో లేవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించడం సంతోషంగా ఉందని చెప్పారు ఈ విజయవాడ వాసి. ఎనిమిది దశాబ్దాలుగా వివిధ దేశాల్లో కచేరీలు ఇచ్చే అవకాశం దక్కడాన్ని గొప్ప గుర్తింపుగా భావిస్తున్నాని తెలిపారు. కొత్త రాగాలు, తాళాలనూ సొంతగా సమకూర్చానన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో 1923 మార్చి 23న రామస్వామి జన్మించారు. బాల్యంలో ఆయన ఎన్నో కష్టాలను చవిచూసినట్లు తెలిపారు. వాటి మధ్యే సంగీతంలో నిలదొక్కుకున్నానన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణతో పాటు సంగీతం నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఆయన కచేరీలకు వయోలిన్‌ సహకారం అందించడం మరచిపోలేని అనుభూతి అని రామస్వామి సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రపతి అవార్డ్​కు ఎంపికైన జైళ్ల శాఖ హెడ్ వార్డర్ రత్నరాజు

Last Updated : Jan 26, 2021, 6:10 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.