35 ఏళ్లు నిండిన వాలంటీర్లను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గ్రామ వార్డు సచివాలయ శాఖ కమిషనర్ జీఎస్ నవీన్ కుమార్ స్పష్టం చేశారు. అనవసరమైన అనుమానాలకు తావిస్తూ వాలంటీర్లను భయాందోళనలకు గురిచేస్తూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన కేవలం 6 మందిని మాత్రమే తొలగించాలని తాము ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. మిగిలిన వారెవర్నీ తొలగించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా నియమితులైన వాలంటీర్లు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని నవీన్ కుమార్ సూచించారు.
ఇదీ చదవండి: 35 ఏళ్లపైబడిన వాలంటీర్లు ఔట్.... జిల్లా యంత్రాంగానికి సీఎం ఆదేశం...