ETV Bharat / city

నిబంధనలకు సరేనంటే.. మీ ఇంట్లో పెళ్లికి అనుమతి: విజయవాడ సీపీ

కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపుగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. వివాహాది శుభ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు. కొందరు మాత్రం.. అనుకున్న సమయానికి వేడుక చేయలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. అలాంటివారికి విజయవాడ పోలీస్ కమిషనర్.. ఓ అవకాశాన్ని కల్పించారు.

vijyawada cp clarification on marriages due to lockdown

author img

By

Published : Apr 10, 2020, 5:26 PM IST

ఫోన్ ఇన్ కార్యక్రమంలో విజయవాడ సీపీ

లాక్ డౌన్ నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ప్రజలు వివాహ కార్యక్రమాలను వాయిదా వేసుకోవటం మంచిదని విజయవాడ సీపీ ద్వారక తిరుమలరావు అభిప్రాయపడ్డారు. ఈటీవీ భారత్​ నిర్వహించిన 'ఫోన్ ఇన్' కార్యక్రమంలో ఈ విషయంపై ఓ కాలర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఓ నిబంధనకు అంగీకరిస్తే మాత్రం.. అనుమతి ఇస్తామని కాస్త వెసులుబాటు కల్పించారు. విజయవాడ పరిధిలో జరిగే పెళ్లికి కేవలం 20 మంది మాత్రమే హాజరవుతామనే విషయాన్ని ధ్రువీకరిస్తూ.. పోలీసు శాఖకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని వెల్లడిస్తామన్నారు. అంతకంటే ఎక్కువ మంది వస్తే మాత్రం కుదురదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.